వార్డ్ రిజర్వేషన్లపై అపోహలు వద్దు : జిఎంసి కమిషనర్
గుంటూరు నగరపాలక సంస్థ వార్డ్ ల రిజర్వేషన్లపై వివిధ వాట్సప్ గ్రూప్ లు, సోషల్ మీడియాల్లో ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అటువంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థలో 57 వార్డ్ లను 76 లుగా పెంచుతూ మంగళవారం(15వ తేదీ) రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ని ప్రకటించిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు వార్డ్ ల వారీగా గుర్తింపు కార్డ్ ఓటర్...