73వ ‘మిస్ వరల్డ్’ పోటీల నుంచి నిఖితా నిష్క్రమణ

మిస్ వరల్డ్ 2026 : భారత్‌కు ఏడో మిస్ వరల్డ్ కిరీటం అందించాలనుకున్న నిఖితా పొర్వాల్ కల చెదిరింది. 73వ ‘మిస్ వరల్డ్’ పోటీల నుంచి నిఖితా నిష్క్రమించింది. వియత్నాంలో జరుగుతున్న ఈ అందాల వేడుకలో టాప్‌- 40లో నిలిచిన ఈ బ్యూటీకి టాప్-20లో మాత్రం చోటు దక్కలేదు. దాంతో.. నిరాశగా వెనుదిరిగిందీ ఉజ్జయిని ముద్దుగుమ్మ. ప్రపంచ సుందరి ఫైనల్లో నిఖిత ముందంజ వేయలేపోయిందని మిస్ ఇండియా సంస్థ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది. వియత్నాం వేదికగా జరుగుతున్న 73వ మిస్ వరల్డ్ ఫైనల్లో సత్తా...