రూ.13 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం జరుగుతున్నాయి. గురువారం నియోజకవర్గ పరిధిలోని 18, 19, 20, 22, 25వ డివిజన్లలో సుమారు రూ.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, తాగునీటి సౌకర్యాలు, సచివాలయ భవన నిర్మాణం వంటి ప్రజలకు నిత్యావసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ పనులు దోహదపడనున్నాయి. 18వ డివిజన్‌లో రూ.1.13 కోట్ల...