మారికవలస గురుకుల పాఠశాల తరలింపు అన్యాయం

అలా చేయటం గిరిజన హక్కులను కాలరాయడమే : చౌటూరి రమేష్ అమరావతి\విశాఖపట్నం, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ​మారికవలస గిరిజన గురుకుల పాఠశాల తరలింపు నిర్ణయం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి చౌటూరి రమేష్ మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో పాటు వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గిరిజనులకు మెరుగైన విద్య, వసతులు కల్పించాల్సింది...