BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 10:45 am Posted by : Raghunath Rolla

గుంటూరు మూడు వంతెనలు వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్

గుంటూరు, 12 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు మూడు వంతెనలు వద్ద శనివారం ఉదయం నుండి భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో రోడ్డుపైకి వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు, ఇతర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీస్ కనిపించడం లేదు.

శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరగడం, శ్యామల నగర్ రైల్వే గేట్ వద్ద మరమ్మతులు జరుగుతూ ఉండడంతో ఆ ప్రాంతాల్లో రాకపోక నిలిపివేయబడ్డాయి. దీంతో మూడు వంతెనలు మార్గమే నగర ప్రజలకు ఆధారమైంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.