సంగడిగుంట, 18 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలోని సంగడిగుంట రెడ్ల బజార్ 5 లైన్ నందు శ్రీ మహా గణపతి యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం నాయకులు,స్వీమ్స్ విద్యాసంస్థల చైర్మన్ భీమనాదం భరత్ రెడ్డి,గుంటూరు తూర్పు శాసనసభ్యులు నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ షేక్ షజీలా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి 3,000 మంది భక్తులు దాకా పాల్గొని స్వామివారి అన్నదానాలు స్వీకరించారు. శ్రీ మహాగణపతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో వార్షికోత్సవం సందర్భంగా గణేశుడికి పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ రెండో వార్షికోత్సవం సందర్భంగా రేపు శనివారం లడ్డు వేలం పాట, గణేష్ నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరారు.