BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:33 am Posted by : Raghunath Rolla

‘ఆడపిల్లల్ని రక్షిద్దాం’ లఘు చిత్రాల పోటీలు

గుంటూరు, 19 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అంతర్జాతీయ బాలికా దినోత్సవమును పురస్కరించుకొని అక్టోబర్ 11వతేదిన నిర్వహించనున్నలఘు చిత్రాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణి కె. విజయలక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల యందు “ఆడపిల్లలను రక్షిద్దాం”అన్న అంశంపై లఘు చిత్రాల పోటీలను ఈనెల 30కి ముందు నిర్వహించి, ఉత్తమమైన వాటికి మొదటి బహుమతి రూ.30,000,రెండవ బహుమతి రూ.20,000 మరియు మూడవ బహుమతి రూ.10,000 నగదును జిల్లా కలెక్టర్ చేతులమీదుగా విజేతలకు, అక్టోబర్ 11వ తేదిన అందజేయడం జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లాలో లో కేవలం 2 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మాత్రమే ఉన్నాయని,అవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,చేబ్రోలు మాత్రమేనని, ఈ అంశం పై ఆర్ జె డి హయ్యర్ ఎడ్యుకేషన్ కి సర్క్యులర్ పంపామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పిల్లలు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు.