పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం !

హైదరాబాద్, 08 సెప్టెంబర్‌ 2026 : తమను ఎందుకు అడ్డుకుంటున్నారన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ‘ఎవడ్రా నువ్వు.. మాకే చెప్తావా?’ అంటూ ఓ పోలీసు అధికారి దౌర్జన్యానికి దిగారు. తోటి పోలీసులు కూడా పూనకంతో ఊగిపోయారు. దురుసుగా ప్రవర్తించారు. హైదరాబాద్‌ నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్‌ నివాసానికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఇతర బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు బొల్లారం చెక్‌పోస్టు వద్ద అడ్డుకున్నారు. సాఫీగా వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పోలీసులను ప్రశ్నించారు. అంతే...