BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 7:19 am Posted by : Raghunath Rolla

రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు MBBS అడ్మిషన్స్ లో అన్యాయం

గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు MBBS అడ్మిషన్స్ లో అన్యాయం జరుగుతోందని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర రావు తెలిపారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2026లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన మెడికల్ అడ్మిషన్స్ లో AU region లో ఓపెన్ కాంపిటేషన్ కట్ ఆఫ్ ర్యాంక్ 71,547 గా ఉందన్నారు. అయితే ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు కన్నా బెటర్ ర్యాంకు సాధించిన 43 మంది రిజర్వేషన్ క్యాటగిరి విద్యార్థులకు నిబంధనల ప్రకారం ఓపెన్ క్యాటగిరిలో సీటు కేటాయించవలసి ఉండగా రిజర్వేషన్లు సీట్లు కేటాయించారని చెప్పారు. అదేవిధంగా SVU region లో ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు 94, 966 కాగా ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంకు కన్నా బెటర్ ర్యాంకు సాధించిన 27 మంది రిజర్వేషన్ క్యాటగిరి విద్యార్థులకు నిబంధనల ప్రకారం ఓపెన్ క్యాటగిరిలో సీటు కేటాయించవలసి ఉండగా రిజర్వేషన్లు సీట్లు కేటాయించారని అన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఓపెన్ కాంపిటీషన్ కన్నా బెటర్ మార్కులు సాధించిన రిజర్వేషన్ కేటగిరి అభ్యర్ధులను ఓపెన్ క్యాటగిరి గానే పరిగణించాలని అనేకసార్లు చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ కేటగిరి విద్యార్థులకు హాని చేయటం కొసం కొత్తగా తెచ్చిన జీవో నెంబర్ 102 వలన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించినట్లు అయ్యిందని ఆరోపించారు. కనుక రిజర్వేషన్ విద్యార్థులకు న్యాయం చేసేందుకు తక్షణమే జీవో నెంబర్ 102 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.