BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 7:05 pm Posted by : Raghunath Rolla

ఘనంగా తాళ్ల వెంకటేష్ యాదవ్‌ జన్మదిన శుభాకాంక్షలు

గుంటూరు, 06 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన సందర్భంగా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (TNUS) గుంటూరు జిల్లా టీమ్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TNUS రాష్ట్ర కార్యదర్శి ఎన్.వి. జగదీష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు పసల బాలస్వామి, జనరల్ సెక్రటరీ పాలేటి జగదీష్ బాబు, గౌరవ సలహాదారులు కె. ఫణిదత్తు, కె. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్.వి. జగదీష్ కుమార్ మాట్లాడుతూ.. తాళ్ల వెంకటేష్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని కోరారు. ఆయన చేపట్టే కార్యక్రమాల్లో TNUS ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, బలహీన వర్గాల సంక్షేమం కోసం తాళ్ల వెంకటేష్ యాదవ్ చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని, ఆయనకు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత బాధ్యతలు దక్కాలని TNUS గుంటూరు జిల్లా టీమ్ ఆకాంక్షించింది. ప్రజా సేవలో ఆయనకు తమ సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది.