ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ రికార్డు
83,638 గృహాల సందర్శనతో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన పార్టీ శ్రేణులు : ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విజయవంతం చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభినందించారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల గ్రీవెన్స్...