గుంటూరు, 23 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 60కి పైగా కీలక అంశాలకు ఆమోదం లభించింది. గుంటూరు సహా కర్నూలు, రాజమండ్రి, తిరుపతిలో కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి గ్రామాల్లో మౌలిక వసతులకు రూ.1,548.98 కోట్లు, రాజధాని ఇన్ఫ్రా పనులకు అదనంగా రూ.644.98 కోట్లు కేటాయించింది. అసెంబ్లీ భవన స్పైర్, రూఫ్, లిఫ్టు పనులకు రూ.661 కోట్లు మంజూరయ్యాయి.