పెందుర్తి లో వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
భక్తులను అలరించిన భరతనాట్య ప్రదర్శన.. ఘనంగా హోమం, తీర్థప్రసాద వితరణ విశాఖపట్నం జిల్లా పెందుర్తి లోని లక్ష్మీనగర్ కాలనీలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన భరతనాట్య సాంస్కృతిక కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళాకారుల అద్భుత నృత్య ప్రదర్శన, అభినయం భక్తుల్లో భక్తిభావాన్ని, ఉత్సాహాన్ని నింపాయి. కాలనీవాసులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఆస్వాదించారు....