వీఎంసీలో డీజిల్ దోపిడీకి అడ్డూ అదుపు లేదా ?
సింగ్‌నగర్ రైతుబజార్ కేంద్రంగా అక్రమాల ఆరోపణలు కదలని వాహనానికి రోజూ 36 లీటర్ల డీజిల్ ఎలా? లాగ్‌బుక్‌లలో మాయాజాలమా.. అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు విజయవాడ, 05 సెప్టెంబర్ 2026, భారత ప్రతినిధి న్యూస్ : విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ)లో ప్రజాధనం దుర్వినియోగంపై మరోసారి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సింగ్‌నగర్ రైతుబజార్ పరిసరాలను కేంద్రంగా చేసుకుని మున్సిపల్ వాహనాలకు కేటాయించే డీజిల్ వినియోగంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధుల్లో భాగంగా క్షేత్రస్థాయిలో తిరగాల్సిన ఓ వాహనం చాలాకాలంగా ఒకేచోటే నిలిచి ఉంటున్నప్పటికీ, రికార్డుల్లో...