పెదకాకాని మండలంలో వివిధ పాఠశాలలను తనిఖీ చేసిన డిఇఓ

గుంటూరు, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష పెదకాకాని మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంబూరు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నంబూరు, మండల ప్రాథమిక పాఠశాల నంబూరు లను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలను, ఎఫ్ ఏ వన్ పరీక్షల లొ వచ్చిన మార్కుల తీరును, చూచిరాత పుస్తకాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం...