అమరావతి ఛాంపియన్స్ ను అభినందించిన జె.సి
గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అమరావతి ఛాంపియన్‌షిప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన గుంటూరు జిల్లా క్రీడాకారులను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అభినందించారు. తిరుపతిలో ఆగస్టు 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు 10 బంగారు పతకాలు, 9 వెండి పతకాలు సాధించారు....