భారీ వర్షాల నేపథ్యంలో కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన

గుంటూరు, 24 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ గురువారం పట్టాభిపురం, స్తంభాల గరువు, ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-1, ఫేజ్-2, కాకాని రోడ్, బుడంపాడు తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, వర్షపు నీటి పరిస్థితులను పరిశీలించారు. కంకరగుంట, 3 వంతెనల ఆర్ఓబి ల వద్ద రెగ్యులర్‌గా సిబ్బందిని ఏర్పాటు చేసి, మోటార్ల ద్వారా వర్షపు నీటిని యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. డ్రైన్లలోని మెష్‌ల వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను...