గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం
బాలిక జమున కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించాలి బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలి : సిపిఐ(యం) పోలవరం, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల మలేరియా మందులు వికటించి ఒక చిన్నారి మృతి చెందడం, పదుల సంఖ్యలో గిరిజన పిల్లలు అస్వస్థతకు గురికావడం అత్యంత ఆందోళనకరం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యే. గిరిజన ప్రాంతాల్లో ‘గిరిజన సంజీవని’ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వ డొల్లతనం...