ఘనంగా ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదిన వేడుకలు

డేగల ప్రభాకర్ జన్మదినోత్సవం సందర్భంగా యువత స్వచ్ఛంద రక్తదానం గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఐడీసీ) చైర్మన్ డేగల ప్రభాకర్ జన్మదినోత్సవ వేడుకలు గుంటూరులో సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిగాయి. జన్మదిన వేడుకలను ఆర్భాటాలకు పరిమితం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలుగా నిర్వహించాలనే ఉద్దేశంతో మెగా రక్తదాన శిబిరంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. గుంటూరులోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి యువత...