కర్నూల్, 06 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏపీలోని కర్నూల్‌లో దారుణం చోటు చేసుకుంది. పారిశుధ్య కార్మికురాలిపై కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన స్థలానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని పట్టణానికి చెందిన నర్సమ్మ అనే మహిళ మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. కాగా, రెండేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె జీవిస్తోంది. ఆదివారం ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో నర్సమ్మ శానిటేషన్ విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఇద్దరు మహిళలు.. సడెన్‌గా నర్సమ్మపై దాడికి పాల్పడ్డారు. కళ్లలో కారం కొట్టి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. గమనించిన తోటి న్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సమ్మను స్థానికంగా ఉన్న దవాఖానకు తరలించారు. ప్రస్తుతం నర్సమ్మ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.