త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : త్వరలో జరగనున్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిసెప్షన్ సెంటర్, బ్యాలెట్ బాక్స్ ల భద్రపరచు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటుకు నల్లపాడులోని ప్రభుత్వ పాల్ టెక్నిక్ కాలేజి, లయోలా పబ్లిక్ స్కూల్ లను శనివారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పాల్ టెక్నిక్ కాలేజి, లయోలా స్కూల్ ల్లో ఎన్ని గదులు ఉన్నదీ, ఎంత విస్తీర్ణంలో ఉన్నదీ, వాహనాల...