BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:14 pm Posted by : Raghunath Rolla

రాబోయే ఎన్నికలపై కూటమి నాయకుల సమీక్ష

గుంటూరు, 18 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాబోవు స్థానిక ఎన్నిక రీత్యా గుంటూరు జిల్లాలో కూటమి నాయకత్వం చేపట్టబోవు విధి విధానాలపై స్థానికంగా ఓ కన్వెన్షన్ హాల్లో కూటమి సమన్వయ కమిటీ శుక్రవారం సమావేశం అయింది.

అనంతరం విలేకరులతో డా.పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, అందించిన ఎన్నికల్లో ఘన విజయం, మెజారిటీ వచ్చిందంటే ఆది అందరి సమన్వయ కృషి. అందుకు దక్కిన ఫలితంగానే ఈరోజు మనం నిధులు తెచ్చుకోగలుగుతున్నాం. ఈరోజు కూడా మనమందరం కలిసి పని చేస్తే 100% స్ట్రైక్ రేట్ వచ్చేలా పని చేద్దాం. కూటమి తరఫున ఎవరైతే అభ్యర్థులు నిలబడతారో వారి విజయానికింప్రతే ఒక్కరం కష్టపడదామని తెలియజేశారు.

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కూటమి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అమలుపరచాలి. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్లోకి వెళ్లడం పై చర్చలు జరిపారు. గడిచిన 2.5 ఏళ్లలో ఉత్తమమైన పాలనను మన ప్రభుత్వం అందజేసింది. నూటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేట్ ఉండేలా స్థానిక, పంచాయతీ, మండల ఎన్నికల్లో పని చేయాలని నిర్ణయించాము. స్థానికంగా ఎంత బలం ఉందనేది బేరీజు వేసి, పై స్థాయికి తీసుకు వెళితే, అక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది నిర్ణయించడమనేది జరుగుతుంది. పోటీ ఎవరు చేసినా సరే ఆ అభ్యర్థిని గెలిపించుకోవడమే మా నిర్ణయంగా ఈ సమావేశములో చర్చించాము. ఎక్కడా మాకు పొరపొచ్చలు లేవు. అక్కడక్కడ చిన్న ఇబ్బందులున్నా సరే, సర్దుకుని విజయమే ధ్యేయంగా పని చేస్తాము. జగన్ మోహన్బ్రెడ్డిని జనంఇప్పటికే వదిలేశారు. ఈ ఎన్నికలు ఏమంత గొప్పవి కాదని, అసలైన ఎన్నికల్లో చూసుకుందామంటూ ఆయన చెప్పిన మాటలు వైసీపీ కేడర్ లో నిరుత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, రాజు, బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షులు తిరుపతి రావు, సూర్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు, వల్లూరి జయప్రకాష్, రాష్ట్ర బిజెపి నాయకులు, జనసేన పార్టీ తరఫున కమల్ షేక్, చల్లపల్లి శ్రీనివాస్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.