కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ : ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, 16 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ రెండు ఏళ్లలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశాం కాబట్టి గర్వంగా ప్రజలను ఓటు అడుగుదామని, దానికి పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి కార్యకర్తల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి, పార్టీ...