తాడికొండ, 15 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి మృతిపై మెజిస్టేరియల్ విచారణ చేపట్టాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం పొన్నెకల్లు గ్రామంలో గోపి కుటుంబాన్ని సిపిఐ బృందం పరామర్శించింది. మృతికి గల కారణాలను కుటుంబీకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా విలేకరులతో ముప్పాళ్ళ మాట్లాడారు. గోపి మృతితో పోషణ దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోపి మృతి పై ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో నిక్సపాక్ష విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుని భార్య జ్యోతి కి ఉద్యోగ వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సిపిఐ పార్టీ తరఫున ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి సిపిఐ పార్టీ తరఫున కుటుంబానికి రూ. 5000. ఆర్థిక సహాయం అందజేశారు.మృతుని కుటుంబానికి న్యాయం జరిగే వరకూ సిపిఐ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, సహాయ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, మేడా హనుమంతరావు, తాడికొండ నియోజకవర్గ కార్యదర్శి ముప్పాళ్ళ శివశంకరరావు, కౌన్సిల్ సభ్యులు రేపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.