విలీన గ్రామాల్లో పెండింగ్ పనులు పై సమగ్ర నివేదిక ఇవ్వాలి
జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామాల్లో పెండింగ్ అభివృద్ది పనులు, మౌళిక వసతుల కల్పనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం చౌడవరం, జూనం చుండూరు, పొత్తూరు తదితర ప్రాంతాల్లోపర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర శివారు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్లు, శ్మశానవాటికలపై...