38 బైక్స్.. 3 ఆటోలు సీజ్ !

గుంటూరు, 19 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయాన్నే పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈస్ట్ డి.ఎస్.పి సీతారామ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు. ఈ క్రమంలో కొత్తపేట స్టేషన్ సిబ్బంది పలు గృహాలను పరిశీలించి ఇంట్లో నివాసం ఉంటున్న వారి చిరునామా పత్రాలు, వాహనాలకు సంబంధించిన వివరాలను గురించి ఆరా తీశారు. 38 బైక్స్, 3 ఆటోలను సీజ్ చేసినట్లు డి.ఎస్.పి తెలియజేశారు.