సమగ్రత పారదర్శకతపై సౌత్ కోస్ట్ రైల్వే విజిలెన్స్ సెమినార్

  విశాఖపట్నం, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయంలో గురువారం విజిలెన్స్ సెమినార్ నిర్వహించారు. జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పి హెచ్ ఓ డి లు, డి ఆర్ ఎం లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, అవినీతి నిరోధానికి అవగాహన, అప్రమత్తత, పారదర్శకత ఎంతో కీలకమని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది నిబంధనలు పాటిస్తూ అత్యున్నత స్థాయి నిజాయితీతో విధులు నిర్వహించాలని సూచించారు. విజిలెన్స్...