విశాఖపట్నం, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయంలో గురువారం విజిలెన్స్ సెమినార్ నిర్వహించారు. జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పి హెచ్ ఓ డి లు, డి ఆర్ ఎం లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, అవినీతి నిరోధానికి అవగాహన, అప్రమత్తత, పారదర్శకత ఎంతో కీలకమని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది నిబంధనలు పాటిస్తూ అత్యున్నత స్థాయి నిజాయితీతో విధులు నిర్వహించాలని సూచించారు. విజిలెన్స్ విభాగం సలహాదారు, మార్గదర్శిగా అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఎస్‌డిజిఎం, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆశిష్ మెహ్రోత్రా మాట్లాడుతూ నైతిక పని సంస్కృతిని పెంపొందించడంలో ప్రతి ఉద్యోగి బాధ్యత వహించాలని అన్నారు. రైల్వే ఉద్యోగ నియామకాలు కేవలం అధీకృత ఆర్ఆర్బి లు, ఆర్ ఆర్ సి ల ద్వారానే జరుగుతాయని, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే దళారులు, మధ్యవర్తులు, మోసగాళ్లను నమ్మవద్దని ఉద్యోగార్థులను హెచ్చరించారు.