విలువలతో కూడిన సమాజం నెలకొల్పడమే ధ్యేయం కావాలి
జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విలువలతో కూడిన సమాజం నెలకొల్పడమే ధ్యేయం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుపూజోత్సవ దినోత్సవం - 2026 కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గల ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఘనంగా సత్కరించారు. ఈ...