విధుల్లోనే గుండెపోటుతో నున్న సీఐ అహమ్మద్ అలీ హఠాన్మరణం
విజయవాడ, సెప్టెంబరు 27 : విజయవాడ నగర పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. నున్న పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) షేక్ అహమ్మద్ అలీ విధుల్లో ఉండగానే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గాంధీనగర్లోని ధర్నా చౌక్ వద్ద ఆదివారం 'ఛలో విజయవాడ' నిరసన కార్యక్రమ బందోబస్తు విధులు నిర్వహిస్తుండగా ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు.దీనిని గమనించిన తోటి పోలీస్ అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ను చికిత్స నిమిత్తం నగరంలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో...