BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 10:35 pm Posted by : Raghunath Rolla

విధుల్లోనే గుండెపోటుతో నున్న సీఐ అహమ్మద్ అలీ హఠాన్మరణం

విజయవాడ, సెప్టెంబరు 27 : విజయవాడ నగర పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. నున్న పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) షేక్ అహమ్మద్ అలీ విధుల్లో ఉండగానే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద ఆదివారం ‘ఛలో విజయవాడ’ నిరసన కార్యక్రమ బందోబస్తు విధులు నిర్వహిస్తుండగా ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు.దీనిని గమనించిన తోటి పోలీస్ అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ను చికిత్స నిమిత్తం నగరంలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో వైద్యులు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. సీఐ అహమ్మద్ అలీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.కర్తవ్య నిర్వహణలో ఉండగానే సమర్థుడైన అధికారి ఇలా ఆకస్మికంగా కన్నుమూయడంతో విజయవాడ పోలీస్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి, విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సహచర అధికారులు, ఉన్నతాధికారులు లోతైన సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.