బిజేపి ఆర్‌ఎస్‌ఎస్‌ల దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం : యన్నం సుధీర్‌బాబు
విజయవాడ, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు జరిగిన అవమానంపై ప్రశ్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యన్నం సుధీర్‌బాబు తీవ్రంగా ఖండించారు. ఏపీసీసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ.. కులతత్వ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా, వాటిని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. ఇది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు.ఇలాంటి కేసులకు కాంగ్రెస్ పార్టీ భయపడబోదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని, త్వరలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ నిరసనలో గుంటూరు జిల్లా నుంచి కొరివి వినయ్‌కుమార్, గడ్డం పాల్, మంగళగిరి సలీం, వెంకటరెడ్డి, దిలీప్, యలమంద, లీగల్‌సెల్ కృష్ణ, వాల్మీకి శ్రీనివాస్, బ్రహ్మం, సుధాకర్ తదితరులతో పాటు గుంటూరు జిల్లా నుంచి పెద్ద సంఖ కార్యకర్తలు పాల్గొన్నారు.