BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 8:36 pm Posted by : Yaddanapudi Arudra

మహిళను బెదిరించి అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్

గుంటూరు, 05 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మహిళను కత్తితో బెదిరించి, అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తాడికొండ మండలం, తాతిరెడ్డిపాలెంకి చెందిన గణేశ్, గుంటూరు కన్నావారితోటకు చెందిన ఓ మహిళను గత నెల 14న కత్తితో బెదిరించి కారులో ఎక్కించుకొని వెళ్ళి లాం సమీపంలో అత్యాచారం చేశాడు. వీడియోలు తీసి, తాను పిలిచినప్పుడల్లా రావాలని లేకుంటే వీడియోలు భయటపెడతానని బెదిరించాడు. మహిళ ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని బాధితులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా వెంటనే పోలీసులు ఆశ్రయించాలని నల్లపాడు పోలీసులు సూచించారు.