పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 11000 పోస్టులు భర్తీ చేయాలి : ఏఐవైఫ్

గుంటూరు, 21 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 11000 ఎస్.ఐ, కానిస్టేబుల్ పోస్టులకు పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టాలని మరియు వయోపరిమితి 5 సంవత్సరాలు పెంచాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం లో అధికారులకు ఏఐవైఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత, అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి...