త్వరలో అర్హులందరికీ పింఛన్లు : ఎమ్మెల్యే నసీర్

గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించబోతున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ తెలిపారు. శుక్రవారం స్థానిక తూర్పు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉంటామని తెలిపారు. ఎక్కువగా పింఛన్లు, ఇంటి స్థలాలు, శానిటేషన్, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు వచ్చాయని, సంబంధిత అధికారులకు అర్జీలను పంపించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని...