జీఎంసీ పిజిఆర్ఎస్ కు 35 అర్జీలు

గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పీజీఆర్‌ఎస్‌లో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని గుంటూరు నగరపాలక సంస్థ ఇంచార్జ్ అదనపు కమిషనర్ జి. సాంబశివరావు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా...