BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 7:46 am Posted by : Yaddanapudi Arudra

జీఎంసీ పిజిఆర్ఎస్ కు 35 అర్జీలు

గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పీజీఆర్‌ఎస్‌లో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని గుంటూరు నగరపాలక సంస్థ ఇంచార్జ్ అదనపు కమిషనర్ జి. సాంబశివరావు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినవే వస్తున్నాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా త్రాగునీరు మరియు పారిశుధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను యుద్దప్రాతిపదికన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే, ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి వివరించి, ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పిజిఆర్ఎస్ ద్వారా 35 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 12, ఇంజినీరింగ్ విభాగం 13, రెవెన్యూ విభాగం 6, ప్రజారోగ్య విభాగం 1, ఉపా సెల్ విభాగం 2, అకౌంట్స్ విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాసరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, డి.సి.పి సూరజ్ కుమార్, విభాగాధిపతులు పాల్గొన్నారు.