ఘనంగా శ్రీ వీరభద్ర స్వామి 25వ వార్షిక మహోత్సవం నిర్వహణ

గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో కొలువై ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి 25వ వార్షిక మహోత్సవాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, పూర్ణకుంభ స్వాగతం అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏఆర్ డీఎస్పీ శంకరయ్య దంపతులతో కలిసి ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి వంశీ ఆధ్వర్యంలో ఐదుగురు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు....