BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 8:34 pm Posted by : Tirupathireddy Nagireddy

ఘనంగా టిడిపి నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

గుంటూరు, 06 సెప్టెంబరు, భారత్ ప్రతినిథి న్యూస్ : తెలుగుదేశం పార్టీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి అశోక్ నగర్ లోని కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్అ భిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ యాదవ్ తో పాటు బిజెపి, జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు.ఆయన బాటలో తామంతా పయనిస్తామని ప్రకటించారు వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పురోభివృద్ధికి పటిష్ఠానికి రాజీలేని కృషి చేస్తానని ప్రకటించారు. ఇతర ప్రముఖులు మాట్లాడారు వెంకటేష్ యాదవ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉన్నత పదవులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.