గుంటూరు నగరపాలక సంస్థకు జాతీయ స్థాయి గుర్తింపు
గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వాయు కాలుష్య నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచి, కేంద్ర పర్యావరణ శాఖ నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’2026 లో గుంటూరు నగరం ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్ (గంగా ఆడిటోరియం)లో ‘స్వచ్ఛ వాయు దివస్’ సందర్భంగా సోమవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) అధిపతి ఛైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ చేతుల మీదుగా గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్...