BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 7:49 am Posted by : Yaddanapudi Arudra

గుంటూరు నగరపాలక సంస్థకు జాతీయ స్థాయి గుర్తింపు

గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వాయు కాలుష్య నియంత్రణలో విశేష ప్రతిభ కనబరిచి, కేంద్ర పర్యావరణ శాఖ నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’2026 లో గుంటూరు నగరం ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్ (గంగా ఆడిటోరియం)లో ‘స్వచ్ఛ వాయు దివస్’ సందర్భంగా సోమవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) అధిపతి ఛైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ చేతుల మీదుగా గుంటూరు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా 130 నగరాల మధ్య జరిగిన పోటీలో గుంటూరు నగరం పట్టణాల కేటగిరిలో ద్వితీయ స్థానంలో నిలవడం మనందరికీ ఎంతో గర్వకారణం. రాష్ట్ర స్థాయిలో కేటగిరీ 2 (10,000 నుండి 30,000 జనాభా వర్గం)లో జిఎంసి 42వ వార్డ్ తొలి స్థానంలో నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మరియు గుంటూరు నగరవాసులందరికీ హృదయపూర్వక అభినందనలు కమిషనర్ మయూర్ అశోక్ తెలియజేసారు.