కొత్త పింఛన్లు పారదర్శకంగా మంజూరు చేస్తాం : ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అర్హులైన వారందరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. పెన్షన్ మంజూరులో అర్హతే ప్రామాణికమని రాజకీయాలకు తావు లేదని ఎమ్మెల్యే తెలిపారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే...