చండ్రేడులో ఘనంగా అణగారిన వర్గాల యువత ఐక్యత మహాసమావేశం
రాజమండ్రి బ్యూరో, 31 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనపర్తి నియోజకవర్గం చండ్రేడు గ్రామంలో ఆదివారం ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ యువత ఐక్యత మహాసమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి గ్రామ యువత భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథులుగా ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉందిర్తి. సుబ్బారావు, జై భీమ్ ఫాలోవర్స్ రాష్ట్ర అధ్యక్షులు కొంగు. సందీప్ రాజ్ హాజరయ్యారు. అతిథులుగా అనపర్తి నియోజకవర్గ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చండ్రేడు గ్రామ నాయకులు...