డీఎస్సీ పై వైసీపీ దుష్ప్రచారం దారుణం

ఫలితాలు వచ్చినప్పుడు అభినందనలు.. ఇప్పుడు బోగస్ అంటూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, 11 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగమేనని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఎన్నో ఏళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల కలను...