బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
బాపట్ల, 12 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బాపట్ల పట్టణంలోని 17వ వార్డులో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచార కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో బాపట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడమే తన ధ్యేయమని స్పష్టం చేసిన ఆయన, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.