సెక్యూరిటీ గార్డుల పొట్టగొట్టిన ఐటీసీ వెల్‌కమ్ !

'పరిగ్రీన్' ఏజెన్సీతో కలిసి ఘోర మోసం.. 3 నెలలుగా వేతనాలు ఎగ్గొట్టిన వైనం నోరు విప్పితే బెదిరింపులు.. గుంటూరు లేబర్ అధికారుల నిమ్మకు నీరెత్తిన వైఖరి ! గుంటూరు, 10 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కోట్లు గడిస్తూ, ఐదు నక్షత్రాల హోదాను ప్రదర్శించే ఐటీసీ వెల్‌కమ్ హోటల్ యాజమాన్యం నిజస్వరూపం బయటపడింది. రాత్రింబవళ్లు కష్టపడి భద్రత కల్పించిన 19 మంది పేద సెక్యూరిటీ గార్డుల కడుపు కొడుతూ దారుణ దోపిడీకి పాల్పడుతోంది. గత 3 నెలలుగా జీతాలు చెల్లించకుండా, అడిగితే దాటవేస్తూ...