నాగబాబుకు విన్నకోట సురేష్ హృదయపూర్వక అభినందనలు
అమరావతి, 28 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా క్యాబినెట్ హోదాతో ప్రమాణస్వీకారం చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌరవ శాసనమండలి సభ్యుడు కొణిదెల నాగబాబును విన్నకోట సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అమరావతిలో శుక్రవారం జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా నాగబాబును కలిసి పుష్పగుచ్ఛం అందించిన విన్నకోట సురేష్, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...