సిఎం చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ
అమరావతి, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ సందించారు. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని, స్టైఫండ్ 30 శాతం పెంచాలని, ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు, రక్షణ చర్యలు, మెరుగైన పని వాతావరణం కల్పించాలని జూడాలు కోరుతున్నారని లేఖ లో వివరించారు. మన పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో పోలిస్తే ఏపీలో జూడాలకు ఇస్తున్న ఉపకార వేతనం చాలా తక్కువగా ఉందని, ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాకపోతే ఆగస్టు 17 నుండి ఆందోళన మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారని, జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి, వారి సమస్యలను పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.