శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తూమాటి
తాడేపల్లి, 18 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కలిశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించించారు. పార్టీ ఎమ్మెల్సీలంతా సమన్వయంతో పనిచేసి ఆయన...