తాగునీటికి తూర్పులో తిప్పలు
గుంటూరు, 21 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బి.ఆర్. స్టేడియం సమీపంలోని మంచినీటి ట్యాంకులు, ముఫ్తీ మొహల్లా ప్రాంతాల్లో వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. మంచినీటి సరఫరా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆమెకు ఫిర్యాదు చేశారు. తాగునీటి సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై ఫాతిమా...